స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. కుంభకోణంలో ఇరుక్కున్న పాకిస్తాన్ క్రికెటర్లు సల్మాన్ బట్ పేసర్లు మహమ్మద్ ఆసిఫ్ మహమ్మద్ ఆమెర్‌లు నోరు విప్పారు. తాము డబ్బు తీసుకోవడం వాస్తవమేనంటూ స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల విచారణలో అంగీకరించారు. అయితే ఆ సొమ్ము స్పాన్సర్‌షిప్ ఒప్పందాలకు చెందినదని ఈ త్రయం పేర్కొనడం విశేషం.
కాగా ఆటగాళ్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ విధించడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా బెదిరింపుల వైఖరి షురూ చేసింది. ఒక వేళ తమ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో నిర్దోషులని తేలితే ఐసీసీపై దావా వేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:pak, cricketers, spot, fixing, Political, Entertainment, Telugu
|