జీవితాంతం శృంగారం లేకుండా గడపటమే తన దీర్ఘాయువుకి కారణమంటోంది బ్రిటన్‌కు చెందిన 106 ఏళ్ల ఒక వృద్ధ కన్య. ఇంత వరకూ తనకు చుంబన అనుభవం కూడా లేదని బ్రిటన్‌కు చెందిన ఇసా బ్లైత్ చెబు తోంది. వివాహ శృంగార జీవితంతో పనిలేకుండా దీర్ఘకాలంగా జీవిస్తున్న ఆమె శుక్రవారం106వ సం వత్సరంలోకి అడుగుపెట్టినట్లు ది సన్ పత్రిక పేర్కొంది.1904లో జన్మించిన బ్లిత్ శృంగారం కోసం ఎప్పుడూ సమయం కూడా కేటాయించలేదట. పుష్పప్రదర్శనలు సందర్శించడం చర్చికి వెల్ళడానికి తాను ఎక్కువ సమయం కేటాయిస్తానని చెపుతున్న ఈ వృద్ధభామ తీరిక సమయాల్లో గోల్ఫ్ ఆడటం తోట పనిలో నిమగ్నమవ్వడం తనకు ఇష్టమని చెబుతున్నారు.
బ్లిత్‌కు ఆరుగురు తమ్ముళ్లు చెల్లెల్లు ఉన్నారు. షెర్రీ అనే అతన్ని బ్లిత్ ఇష్టపడినట్లు ఆమె మేనకోడలు షీనాక్యాంప్‌బెల్ చెప్పింది. విస్కీ తయారు చేసే సంస్థ యజమాని ఎడిన్‌బర్గ్ వద్ద 35 ఏళ్లపాటు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఆమె వృత్తి రీత్యా తీరికలేకుండా ఉండేవారని మేనకోడలు తెలిపింది. ఏనాడూ విచారం ఛాయలు దరిేరదీమని ఆమె తమ కుటుంబంలో అద్భుత వ్యక్తిగా నిలిచిపోతుందని ఆమెకు 106 సంవత్సరాల వయస్సంటే తామే నమ్మలేకపోతున్నామని క్యాంప్‌బెల్ పేర్కొంది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:106, yrs, old, lady, Political, Entertainment, Telugu
|