గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్-1 పరీక్ష పోలీసు పహరా మధ్య తీవ్ర ఉద్త్రిక్తత నడుమ ఆదివారంనాడు ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఆదివారం ఉదయం నుంచే తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 445 కేంద్రాలలో పరీక్ష జరిగింది. పోలీసు కనుసన్నలలో పరీక్ష జరిగింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు విధ్వంసానికి పాల్పడి బి.ఇ.డి. సెంటర్‌లో అద్దారు పగులగొట్టడంతో పోలీసులు ప్రవేశించి బాష్పవాయువు ప్రయోగించారు. కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణఆలో అనేకచోట్ల పరీక్షా కేంద్రాలవైపు చొచ్చుకురావడానికి యత్నించిన రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా పరీక్ష రాయవలసింది ఇలా పోలీసు కనుసన్నలమధ్య రాయడం భయం కలిగించిందని కొందరు విద్యార్థులు అంటే పోలీసు పహరా ఉంది కాబట్టే ప్రశాంతంగా పరీక్ష రాశామని మరి కొందరు విద్యార్థులు చెప్పారు.
తెలంగాణా కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో జరిగిన ఈ పరీక్షలో విశాఖపట్నంలో అత్యధికంగా అంటే దాదాపు 68 శాతం విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. ఉద్యమ ప్రాంతమైన కరీంనగర్‌లో అత్యల్పంగా అంటే దాదాపు 36 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. కరీంనగర్‌తో పాటు వరంగల్‌లో కూడా అనేక పరీక్షా కేంద్రాలు విద్యార్ధులు లేక వెలవెలపోయాయి. వరంగల్‌లో 37 శాతం విద్యార్ధులు గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యారు.
తెలంగాణలో కొందరు విద్యార్థులు హాల్ టిక్కెట్‌లను చించేశారు. మరికొన్ని చోట్ల విద్యార్థులు పరీక్ష హాల్ లోపలనుంచి బయటకువచ్చి ప్రశ్నాపత్రాలను చించేశారు. తెలంగాణాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా సీమాంధ్రలో కూడా పరీక్షకు హాజరైన విద్యార్ధులు నూటికి నూరు శాతం లేదు. అక్కడ కూడా సగటున 65 శాతం మాత్రమే విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్‌లో 45 శాతం పైన విద్యార్ధులు పరీక్షకు హాజరైనట్టు తెలిసింది.
ఆదిలాబాద్‌లో 43 శాతం నిజామాబాద్‌లో 36.5 శాతం వరంగల్‌లో 37 శాతం ఖమ్మంలో 43 శాతం మెదక్‌లో 43 శాతం అనంతరపురంలో 47 శాతం ప్రకాశంలో 47 శాతం చిత్తూరులో 45 శాతం కడపలో 52 శాతం నెల్లూరులో 48 శాతం కడపలో 52 శాతం గుంటూరులో 52 శాతం విశాఖలో 68 శాతం పశ్చిమ గోదావరిలో 49 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ప్రాథమిక సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:group1, exam, Political, Entertainment, Telugu
|