గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. తుపాకీ నీడలో పరీక్ష జరపడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం అభాసుపాలు కాకుండా వెంటనే పరీక్ష రద్దు చేయాలని ఆయన కోరారు. ఆదివారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రశ్నాపత్రం లీకయిన పరీక్షను అనుమతిస్తారా? ప్రభుత్వం నాలిక కరుచుకుని లెంపలేసుకోవాలన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని పదవిని తొలగించాలన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పరీక్ష రద్దు చేయాలన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:kcr, comments, on, group1, Political, Entertainment, Telugu
|