గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చోటుచేసుకున్నా మొండిగా పరీక్ష నిర్వహించడం సీమాంధ్ర అహంకారమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆమర లగడపాటి కాదని జగడపాటి అని ఎంపి లగడపాటినుద్దేశించి తెలిపారు. ఆదివారం గ్రూప్-1 పరీక్షను అడ్డుకునేం దుకు సంగారెడ్డికి వచ్చిన హరీష్‌రావును పోలీసులు సినీఫక్కీలో అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్టేషన్‌కు తరలించారు. అక్కడ హరీష్‌రావు మీడియాతో మా ట్లాడుతూ సీమాంధ్ర అహంకారం స్పష్టమైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ఎపిపిఎస్సీ చైర్మెన్ డిజిపి అరవిందరావు ఈ ముగ్గురు కూడా సీమాంధ్రకు చెందినవారేనని అందుకే అహంకారాన్ని ప్రదర్శించి మొండిగా గ్రూప్-1 పరీక్షను నిర్వహించారని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా రావా ల్సిన 42 శాతం వాటా కోసం ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:harishrao, comments, Political, Entertainment, Telugu
|