గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లి సమస్యను మరింత జటిలం చేసిందని టీడీపీ సీని యర్ నేత టీ.దేవేందర్ గౌడ్ అన్నారు. అందరూ వద్దంటున్నా వినకుండా ప్రభుత్వం దీన్ని ప్రతిష్టగా తీసుకుని విద్యార్ధుల మనోభావాలను దెబ్బతీసిం దని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. కుల ప్రాంతీయ పక్షపాతిగా ముద్రపడ్డ ఎపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పరీక్షల నిర్వహణ చేయడం బాధా కరమన్నారు. పోలీసుల పహారా కాల్పుల మధ్య పరీక్షల నిర్వహణ దురదృష్టకరమన్నారు. అభ్యర్థుల హాజరు 70శాతం కూడా లేదని తక్షణమే గ్రూప్-1ను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలన్నారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:goud, police, Political, Entertainment, Telugu
|