విద్యార్ధుల మనోభావాలను అను గుణంగా గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలన్న తెలంగాణా మంత్రుల మాటను సీఎం రోశయ్య ఖాతరే చేయలేదని టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ వ్యాఖ్యానించారు. కేబినెట్లో తమ మాటకు విలువ లేనప్పుడు వారు మంత్రివర్గంలో ఉన్నట్లా? లేదా అటెం డర్ పోస్టులో ఉన్నట్లా అని ఆయన సిఎం రోశయ్యనుద్ధేశించి ప్రశ్నించారు. సీఎం మీ మాటకు విలువ ఇవ్వకపోతే ఇంతకంటే పరాభవం మరోటి ఉండదని కేబినెట్‌లో కొనసాగడంపై తెలం గాణా మంత్రులు ఆలోచించుకుంటే మంచిదని కేసిఆర్ సలహా ఇచ్చారు.
ఏడు మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులను అరెస్టు చేసి నిర్భంధంగా పరీక్షను నిర్వహించాల్సిన మొండిపట్టు దల ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల్లోనే పశ్నాపత్రాలు బయటికి వచ్చాయని ఇలా లీక్ అయిన పరీక్ష పరీక్షే కాబోదన్నారు. ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 పరీక్ష నిర్వహణ అంశంలో ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా విద్యార్థుల అభిప్రాయాలు గౌర వించాలని కేసిఆర్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలిని కేసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేటి (సోమవారం) లోగా ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడక పోతే జెఎసీతో చర్చిం చి న్యాయపరంగా వెళ్తామని కేసి ఆర్ హెచ్చరించారు.
విద్యార్ధుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత పరి స్థితులు ఉన్నా.. తుపాకీ నీడలో పరీక్షను నిర్వహించాలని చూసి సర్కారు అబాసు పాలైందన్నారు. పరీక్ష ప్రారంభమై పట్టుమని పది నిమిషాలు కూడా కాకుండానే పశ్నాపత్రాల్లోని అంశాలు ప్రసారమాధ్యమాల ద్వారా జనజీవన శ్రవంతికి చేరిపోయాయ ని ఇలాంటి పరీక్ష పత్రాల స్పాట్ వాల్యూయోషన్ కూడా తగద న్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో విజయశాంతి వినోద్‌కు మార్ తదితరులతో కలిసి కేసిఆర్ విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఓయూ ఘటన మినహా పరీక్ష ప్రశాంతంగా జరిగిం దంటూ ఎపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేయడాన్ని కేసిఆర్ తప్పుబట్టారు. వరంగల్ నల్లగొండ జిల్లాల్లో విద్యార్థులు పరీక్షలు రాయకుండా బహిష్కరించారని కొందరు పరీక్షా కేం ద్రంలోకి వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేశారన్నారు. పరీక్షలకు హాజరై విద్యార్థులే తమకు తాముగా పరీక్షలను బహిష్కరించా రని ఓయూ కళాశాల ప్రిన్సిపల్ అయోధ్య ప్రకటించారన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ministers, or, attenders, Political, Entertainment, Telugu
|