36 ఏళ్ల మనిషిని దెబ్బ తీసేందుకు శక్తులన్నీ ఏకమయ్యాయి. ప్రత్యేకించి టీడీపీ అధినేత చంద్రబాబు ఈనాడు సంస్థల అ«ధిపతి రామోజీరావు కలిసి అణగదొక్కాలని చూస్తున్నారు. అయినా పర్వాలేదు. నాన్నగారి ఆశీస్సులు జనబలం అండతో దేశంలో ఎవరి మీద అయినా పో రాటం చేసేందుకు సిద్ధంగా ఉంటాను'' అని కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఓదార్పు యాత్రలో భాగంగా నాలుగో రోజు సోమవారం కనిగిరి నియోజకవర్గంలోని పామూరు పీసీ పల్లి మండలాల్లో పర్యటించారు. పామూరు పట్టణం పెద్దఈర్లపాడు పీసీ పల్లిల్లో ప్రసంగించారు. ఎమ్మెల్యేలు మంత్రులు నా పక్కన లేకపోయినా జనం నా బాటలో ఉన్నారన్నారు. ఓదార్పుయాత్ర ప్రారంభసభ అయిన పామూరులో కొన్ని పత్రికలంటూ పరోక్షంగా 'ఈనాడు'పై వ్యాఖ్యలు చేసిన జగన్ రాత్రి తొమ్మిది గంటలకు పీసీ పల్లి సభలో బహిరంగ వ్యాఖ్యానాలు చేశారు.
పక్కనే ఉన్న ఈటీవీ వాహనంవైపు చెయ్యిచూపుతూ "అదిగో.. ఈటీవీ ఈనాడు. నేనే పాపం చేశాను. నాపై ఏవేవో రాస్తున్నారు. వారికితోడు మరోవ్యక్తి ఉన్నాడు. ఆయనే చంద్రబాబు అనే నాయకుడు. నేను ఓదార్పు యాత్రలో రాజకీయాలు మాట్లాడుతున్నానట. నేనెప్పుడైనా రాజకీయాలు మాట్లాడానా? ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మృతుల కుటుంబాలను ఓదారుస్తున్నాను. ఇందులో రాజకీయం లేదు. కుళ్లు కుతంత్రం అంతకన్నా లేదు. ఏదైనా మాట్లాడితే ఓదార్పుయాత్రలో రాజకీయం మాట్లాడారు అంటారు. మాట్లాడకపోతే ప్రజాసమస్యలు పట్టవంటా రు.
చంద్రబాబు రామోజీరావు కలిసి నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు'' అని జగన్ అన్నారు. "36 ఏళ్ల మనిషిని దెబ్బ తీసేందుకు ఇన్ని శక్తులు ఏకం కావాలా? అన్ని శక్తులూ ఏకమైనా పర్వాలేదు. నాకున్న జనం బలం చాలు. నాన్నగారి హృదయ స్పందనతో నన్ను ఆశీర్వదించే అభిమానులే నాకు అండ. ఆ బలంతో దేశంలో ఎవరి మీద అయినా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటా'' అంటూ పరోక్షంగా స్వపక్షంలోని తన వ్యతిరేకులను కూడా జగన్ హెచ్చరించారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:jagan, comments, on, highcommand, Political, Entertainment, Telugu
|