'నేను ఒంటరి వాణ్ణి కాను నా వెనుక ప్రజలున్నారు' అని అంతకు ముందు పామూరులో జరిగిన 'ఓదార్పు యాత్ర'లో జగన్ పదే పదే స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు తన వెనుక జనం లేరని ప్రచారం చేస్తున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. పామూరు నుంచి ప్రారంభమైన యాత్ర పి.సి.పల్లి మండలం మీదుగా కనిగిరి వరకూ సాగింది. 'తొమ్మిది నెలలుగా ఏం జరుగుతుందో మీకు తెలుసు. చిరునవ్వుతో ఇక్కడ మీ ముందు నిలబడగలుగుతున్నానంటే మీరు చూపిస్తున్న ఆప్యాయతలే అందుకు కారణం' అని ఆయన చెప్పారు. పలుచోట్ల వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ అభిమానులనుద్దేశించి ఒకటి రెండు మాటలు మాట్లాడి ముందుకు సాగారు. యాత్రలో జగన్ వెంట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. జగన్‌కు అండగా నిలవాలని జిల్లా ప్రజలను కోరారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:jagan, comments, on, highcommand, Political, Entertainment, Telugu
|