ఓదార్పు యాత్ర విషయంలో తన ఆదేశాన్ని ధిక్కరించినందుకు కొన్ని రోజుల క్రితం కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హెచ్చరించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడు ఆయనపట్ల తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. జగన్‌ను బుజ్జగించే ధోరణి కనబరుస్తోందని తెలుస్తోంది. జగన్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయనకు పార్టీ హాని చేయదని బాధపెట్టదని పేర్కొన్నదని మంగళవారం పార్టీలో అత్యున్నతస్థాయి వర్గాల విశ్వసనీయ సమాచారం.
తన తండ్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకస్మాత్తుగా మరణించడం జగన్‌మోహన్‌రెడ్డిని కలచివేసిందని ఆయన బాధను పార్టీ అర్థం చేసుకుందని ఆయనపట్ల సహనం వహించాలని భావిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ‘నాన్న హఠాత్తుగా చనిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. భావోద్వేగానికి లోనవుతున్నారు. వైఎస్ ఆర్ మరణం పార్టీకి కూడా తీరని నష్టం. జగన్‌ను తప్పుదారి పట్టించారు. పార్టీ చేయాల్సిన పనిని (యాత్ర) ఆయన చేపట్టారు’ అని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.
‘జగన్‌కు హాని చేయాలని కానీ బాధించాలని కానీ పార్టీ భావించడం లేదు. పార్టీ ఆయనపట్ల సహనంతో ఉంది’ అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ వద్దన్నా వినకుండా గత శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రను చేపట్టినందుకు క్రమశిక్షణ చర్య తీసుకుంటానని కాంగ్రెస్ అధిష్ఠానం హెచ్చరించిన నేపథ్యంలో మంగళవారం పార్టీ వర్గాలు వ్యక్తపరిచిన అభిప్రాయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:jagan, Political, Entertainment, Telugu
|