'తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాల గురించి నేను సంవత్సర కాలంగా అడుగుతున్నా.. జరగట్లేదు. దీనిపైన ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిస్తే కచ్చితంగా చేస్తానని మాటిచ్చారు. ఇంత తేలిగ్గా పనులవుతాయా అని అప్పట్లో అనుకున్నాను. సంవత్సర కాలంగా ఆ ఫైల్ అక్కడే ఉంది.
ఆలస్యానికి కారణం నిధుల కొరతేనంటున్నారు. నిధులు లేక కాదు నిర్లక్ష్యం వల్ల జరుగుతోంది' అని పీఆర్పీ అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. ప్రస్తుతం రోడ్డెక్కితేనే పనులు జరిగే పరిస్థితి ఉందన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని ఆయన చిరంజీవి ప్రభుత్వానికి విన్నవించారు.
తమ సర్వీసులను క్రమబద్దీకరించాలంటూ ఐదు రోజులుగా ఇందిరా పార్క్‌వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ హాస్టళ్ల కాంట్రాక్టు టీచర్లు చిరంజీవిని కలుసుకున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని కాంట్రాక్టు విధానంపై పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించి మిగిలిన పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలని చిరంజీవిని కోరారు. ప్రభుత్వం ఆదుకోకుంటే తాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. కాంట్రాక్టు టీచర్ల పోరాటానికి పీఆర్పీ మద్దతునిస్తుందని చిరంజీవి ఈ సందర్భంగా వారికి చెప్పారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:chiranjeevi, comments, Political, Entertainment, Telugu
|