ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ఉస్మానియా విద్యార్థుల చేతిలో మరోసారి దేహశుద్ధి తప్పదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీ ష్‌రావు హెచ్చరించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన ధర్పల్లిలో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు దేహశుద్ధి చేసినా లగడపాటి నోటి దురుసు మానలేదని అన్నారు.
తెలంగాణ ప్రజల్ని దేశద్రోహులుగా చిత్రీకరించిన లగడపాటికి తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. నాలుక ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోమన్నారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట మోసం చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్-1 పరీక్షలు రద్దుచేసి తెలంగాణ వాటా ఇచ్చాకే తిరిగి నిర్వహించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:harish, rao, comments, on, lagadapati, Political, Entertainment, Telugu
|