తమ పార్టీ నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సినీ హీరో బాలకృష్ణపై చిరంజీవి వర్గం శాసనసభ్యులు ధ్వజమెత్తారు. బాలకృష్ణ నాణేనికి ఓ వైపు యాక్టర్ మరో వైపు క్రిమినల్ అని వారు వ్యాఖ్యానించారు. చిరంజీవి వర్గానికి చెందిన శ్రీనివాస్ తదితర శాసనసభ్యులు సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చిరంజీవిని గానీ తమను గానీ బాలకృష్ణ ఏమైనా అంటే తాము సహించబోమని వారన్నారు. బాలకృష్ణ చిరంజీవిపై నోరు మూసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. బాలకృష్ణకు ప్రజలే బుద్ధి చెప్తారని వారన్నారు.
చిరంజీవిపై పోటీ చేయడానికి ముందు బాలకృష్ణ ఉప ఎన్నికల్లో శానససభకు పోటీ చేసి గెలవాలని వారు సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే నాయకుడిగా బాలకృష్ణను తాము అంగీకరిస్తామని ఓడిపోతే బాలకృష్ణ శ్రీరామరాజ్యం వంటి సినిమాలు తీస్తూ రామభజన చేసుకోవాలని వారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నీడ కింద ఎవరూ ఎదగలేరని ఈ విషయాన్ని బాలకృష్ణ గ్రహించాలని వారన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:chiru, mlas, fire, on, balayya, Political, Entertainment, Telugu
|