టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యారని నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. చంద్రబాబు అవినీతిపై బాలకృష్ణ మాట్లాడాలన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన దుర్మార్గుడు చంద్రబాబుకు మద్దతిస్తావా? తెలుగుజాతి పౌరుషాన్ని ఢిల్లీలో చాటిచెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అయితే తన అవినీతి కేసులు సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ కాళ్లు పట్టుకున్న నయవంచకుడు చంద్రబాబు. అవినీతికి మారుపేరైన వ్యక్తిని అందలమెక్కించాలంటావా? నీ తండ్రి చావుకు కారణమైన చంద్రబాబుకు మద్దతివ్వాలా? నీకు రోషం పౌరుషం లేవా? నీవు ఎన్టీఆర్‌కు పుట్టిన కొడుకువేనా? ఎన్టీఆర్‌కు ఇటువంటి సంతానం కలగడం చాలా బాధగా ఉంది అని నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబును భుజాన మోసే బానిస బతుకు బాలకృష్ణదని దుయ్యబట్టారు. కుట్రలు కుతంత్రాలతో నందమూరి వంశాన్ని బానిసలుగా చంద్రబాబు తయారు చేసుకున్నారని విమర్శించారు. ఈరోజు ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బాలయ్యా... ప్రజల్లో తొడలు కొట్టడం కాదు. నీ బావ చంద్రబాబు ఇంటి ముందుకెళ్లి తొడగొట్టి మీసం తిప్పు. నా తండ్రి చావుకు కారణమైన దుర్మార్గుడని బాబును నిలదీస్తే తెలుగు ప్రజలు మెచ్చుకుంటారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టావని ప్రశ్నించు. అప్పుడే నీవు నిజమైన హీరో అవుతావు అని పేర్కొన్నారు. చంద్రబాబు నక్కజిత్తుల రాజకీయ ఆలోచనలకు బాలకృష మద్దతుపలకడం దురదృష్టకరమన్నారు.
నీచుడు అవినీతిపరుడైన చంద్రబాబుతో చేతులు కలపవద్దని చక్రవర్తి కుమారుడిలాగా తలెత్తుకు బతకమని ఆమె బాలకృష్ణకు సలహా ఇచ్చారు. చిరంజీవి అన్నట్లు బాలకృష్ణది చిన్నపిల్లవాడి మన:స్తతత్వం అన్నారు. బాలకృష్ణకు రాజకీయ అవగాహనలేదని చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దయ చూపకపోయింటే బాలకృష్ణ జైల్లో ఊచలు లెక్కపెట్టేవారు. జీవితాంతం ఖైదీగా ఉండేవారు. బెల్లంకొండ సురేష్‌పై హత్యాయత్నం చేసిన కేసులో వైఎస్ జోక్యం చేసుకోకుంటే నీ వెక్కడుండే వాడివి బాలయ్యా? జీవితం ప్రసాదించిన వ్యక్తులను విమర్శించడానికి నోరెలా వచ్చింది. వైఎస్‌ను విమర్శిస్తే పుట్టగతులుండవు అని లక్ష్మిపార్వతి దుయ్యట్టారు. వైఎస్ స్థానంలో చంద్రబాబు ఉండుంటే బాలయ్యను కటకటాలపాలు చేసి తనకు అడ్డు తొలగించుకునేవారన్నారు. చంద్రబాబు లాంటి నీచబుద్దిగల వ్యక్తుల కింద పనిచేస్తానని బాలకృష్ణ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:laxmi, parvathi, fire, on, balayya, Political, Entertainment, Telugu
|