బాలకృష్ణ మాట్లాడే మాటలలో ప్రజలకు ఒక్కటీ అర్థం కాదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. అందుకే 2009లో ఆయన ప్రచారం చేసిన చోటల్లా పార్టీ ఓడిపోయిందన్నారు. చిరంజీవి మీద బాలకృష్ణ పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదన్నారు. బాలకృష్ణ మాదిరిగా చిరంజీవి తండ్రిని మోసం చేయలేదన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు తోనే బాలయ్య మాట్లాడతున్నారన్నారు. చంద్రబాబు వేసే పగటి వేషాల్లో బాలయ్యది ఒక పాత్రంటూ లక్ష్మిపార్వతి ఎద్దేవా చేశారు. వంద మంది బాలకృష్ణలు వచ్చినా ప్రజల్లో వై.ఎస్.జగ న్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణను తగ్గించలేరని స్పష్టం చేశారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా జగన్‌ను నిలువరించలేరన్నారు.
నీ తప్పులు కప్పిపుచ్చుకోవడమేకాకుండా అవినీతిపరుడైన బావ తప్పులను కూడా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నావా? అని ఆమె బాలకృష్ణని ప్రశ్నించారు. కోట్లకు పడగెత్తిన చంద్రబాబు నాయుడు అవినీతిపై మాట్లాడమని ఆమె సలహా ఇచ్చారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు మీ తండ్రి మీతో ఏమన్నారో గుర్తు తెచ్చుకోమని ఆమె బాలకృష్ణని కోరారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:laxmi, parvathi, fire, on, balayya, Political, Entertainment, Telugu
|