తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పోటీ చేస్తానని ప్రకటించిన సినీ హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో నారా నందమూరి కుటుంబసభ్యులకు విందు ఇచ్చారు. తన అల్లుడు తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా బాలకృష్ణ ఈ విందును ఏర్పాటుచేసినట్లు తెలిసింది. చంద్రబాబు దంపతులతో పాటు బాలకృష్ణ దంపతులు చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు తనయులు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సోదరులు సోదరీమణులు ఈ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు ఉంటున్న బాలకృష్ణ సోదరుడు రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఆయన తనయుడు జూనియర్ ఎన్‌టిఆర్‌లు ఈ విందు కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలిసింది. విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు జరిపిన పర్యటన అంచనాలకు మించి విజయవంతమైందని పర్యటనకు ప్రజల నుంచి ముఖ్యంగా తెదేపా శ్రేణుల నుంచి విశేష స్పందన వచ్చిందని ఈసందర్భంగా బాలకృష్ణ చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఉప ఎన్నికలలోపు తెలంగాణ ప్రాంతంలో కూడా తాను పర్యటిస్తానని బాలకృష్ణ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ విందు కార్యక్రమంలో చంద్రబాబు బాలకృష్ణ ఇరువురూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు భవిష్యత్ ప్రణాళికపై చర్చించారని తెలుస్తోంది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:balayya, special, party, to, lokesh, Political, Entertainment, Telugu
|