నాగబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా? రాజకీయ వర్గాల నోట విన్పిస్తున్న మాట ఇది. వారసుడి ఎంపికపై చిరంజీవి ఇప్పటికే స్పష్టమైన అభిప్రాయం వెల్లడించినట్టు సమాచారం. సోదరుడు నాగబాబు పేరును అధిష్టానం ముందుకు తీసుకెళ్ళినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి అల్లు అరవింద్ లేదా భార్య సురేఖ పోటీ చేయవచ్చని రకరకాల ఊహాగానాలు విన్పించాయి. అయితే చిరంజీవి మనోగతం మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్‌కు నాగబాబు బలమైన పునాదులు వేశారని చిరంజీవి అనేక సార్లు చెప్పారు. పార్టీ ఆవిర్భావంకు ముందు నుంచే ఆయన తెర వెనుక పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేయించడం పార్టీ అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయడం రాజకీయాలకు అనువైన వాతావరణం తీసుకురావడంలో నాగబాబు కృషి ఉందని చిరు బలంగా విశ్వసిస్తున్నారు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అండగా నిలిచినా కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత దూరమయ్యారు. తనపై అల్లు అరవింద్ ప్రమేయం ఉండటాన్ని పవన్ జీర్ణించుకోలేదని తెలుస్తోంది. ఇది ఒక రకంగా కుటుబంలో కొంత ఇబ్బందిగానే మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అరవింద్ కన్నా నాగబాబును ఎంపిక చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకూ వెన్నంటి ఉన్న నాగబాబుకు సరైన ప్రాతినిధ్యం ఇచ్చినట్టు అవుతుందని ఆయన అంటున్నారు. నాగబాబు కూడా తిరుపతి స్థానం నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:nagababu, to, contest, from, tirupathi, Political, Entertainment, Telugu
|