మదనపల్లె పట్టణంలో జాతీయగీతం లక్షగళార్చన కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న చిరంజీవి జాతీయగీత రచయిత రవీంద్రనాధ్ ఠాగూర్‌ను గుర్తుకు తెస్తూ తాను హీరోగా నటించిన ఠాగూర్ సినిమా డైలాగులు విసిరారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొన్న విద్యార్థు లు ఒక్కసారిగా కేరింతలు ఈలలతో సభాప్రాంగణాన్ని మారుమోగిం చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఠాగూర్ సినిమాలోని కోర్టు సీనులోని డైలాగులను చిరంజీవి అనర్గళం గా చెప్పడంతో యువకుల్లో ఉత్సాహం పొంగిపోయింది. చిరంజీవి మాట్లా డుతూ అద్భుతమైన ఆదర్శవంతమైన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా జాతీయ గీతం రచించి వందసంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బిటి కళాశాలలో ఏర్పాటు చేసిన లక్షగళార్చన కార్యక్రమంలో పాల్గొని తానుకూడా సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించడం ఉద్వేగభరితంగా ఉంద న్నారు. మదనపల్లెకు వన్నెతెచ్చిన 1919లో మొట్టమొదట జాతీయగీ తాలాపన కార్యక్రమం మదనపల్లె నేల చేసుకొన్న పుణ్య మన్నారు. ఆసేతు హిమాచలం దాకా ఠాగూర్ రచించిన జనగణమణను భార తావని ఉన్నంత వరకు భారతజాతి ఆలపించి తీరాల న్నారు. విశ్వకవి రవీంద్ర నాధ్ ఠాగూర్ సంచరిం చిన ఈ ప్రాంతంలో తాను నడవడం ఎంతో గర్వకారణ ంగా వుందని తన శరీరం పులకరిస్తోందన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:tagore, dilogues, Political, Entertainment, Telugu
|