నాగార్జున కె.రాఘవేంద్రరావుల కాంబినేషన్‌కు మంచిపేరుంది. వారి కలయికలో వచ్చిన భక్తిరస చారిత్రాత్మక చిత్రాలు 'అన్నమయ్య' 'శ్రీరామదాసు' ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో తెలియంది కాదు. ఇప్పుడు మళ్లీ వారి కాంబినేషన్‌లో 'శిరిడిసాయి' చిత్రం రూపొందుతోంది. ఇందులో శిరిడిసాయిగా టైటిల్ పాత్రను నాగార్జున పోషిస్తుండగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై శ్రీమతి సులోచనారెడ్డి సమర్పణలో పారిశ్రామికవేత్త ఎ.మహేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యంలో ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. కాగా ఫిబ్రవరి 2న కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో షూటింగ్ ప్రారంభించుకుని 25 రోజుల పాటు అక్కడే షెడ్యూల్ కొనసాగుతుంది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 'ఇదివరకు అన్నమయ్య శ్రీరామదాసు వంటి భక్తుడి పాత్రలు పోషించాను. ఇప్పుడు భగవత్ స్వరూపుడు శిరిడిసాయి పాత్రను పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా నట జీవితంలో ఇది మరపురాని చిత్రమవుతుంది. కె.రాఘవేంద్రరావు దీనిని ఓ గొప్ప దృశ్యాకావ్యంగా మలుస్తున్నారు. ఇక నిర్మాత మహేష్‌రెడ్డి శిరిడిసాయి భక్తులు. మంచి అభిరుచితో ఆయన ఈ చిత్రాన్ని తీస్తున్నారు' అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి మాటలు: పరుచూరి బ్రదర్స్ కథాసంకలనం: భక్తసురేష్.డి. కథాసహకారం: పొందూరి హనుమంతరావు ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి పాటలు: సుద్దాల అశోక్‌తేజ చంద్రబోస్ రామజోగయ్యశాస్త్రి వేదవ్యాస్ సత్తిపండు కళ: భాస్కరరాజు శ్రీకాంత్ సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి నిర్మాత: ఎ.మహేష్‌రెడ్డి దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:nag, speaks, about, shiridi, Political, Entertainment, Telugu
|