అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ సహా ఎక్కడైనా పోటీకి సిద్ధమని నటుడు బాలకృష్ణ చెప్పారు. త్వరలోనే తెలంగాణ ప్రాంతం లో పర్యటిస్తానని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. లక్ష్మీపార్వతి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వబోనన్నారు. చిరంజీవి వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా... నో కామెంట్ అంటూ సంయమనం పాటించాలని అభిమానులను కోరారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:balakrishna, comments, on, chiru, Political, Entertainment, Telugu
|