చిత్ర టైటిల్ లవ్ ఫెయిల్యూర్ అయినా... యూత్ ఆదరణతో లవ్ సక్సెస్ అయిందని చిత్ర నిర్మాత కథా నాయకుడు సిద్దార్థ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. శనివారం నాడు ఈ విధంగా మాట్లాడారు. సినిమా కథలో దమ్ముందికావట్టి నిర్మాతగా వ్యవహరించాను. దానికి బెల్లంకొండ సురేష్ ప్రోత్సాహంతో స్వంతంగా విడుదల చేశాను. నిర్మాతగా మంచి గుర్తింపు వచ్చింది. కాలేజీ విద్యార్థులు పండుగలా ఈ చిత్రానికి వస్తున్నారు. దర్శకుడు కొత్తవాడయినా బాలాజీమోహన్ అద్శుతంగా తెరకెక్కించారు. తమన్ సంగీతం చిత్రానికి ప్లస్ అయింది. ఈ సక్సెస్ నా పుట్టినరోజును మరిపిస్తుంది అని చెప్పారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... ఈ చిత్ర టైటిల్ విని.. నిర్మాతగా.. నీ తొలి ప్రయత్నానికి ఫెయిల్యూర్ అని ఎందుకు పెట్టావ్.. అని అడిగాను. సినిమా చూశాక ఎందుకు పెట్టాడో మీరే చెబుతారు అన్నాడు. నిజంగానే కథకు సరిపడా టైటిల్. కాలేజీవారేక ఫ్యామిలీ ఆడియన్స్‌కూడా చూడతగ్గ చిత్రమిది. ఈ చిత్రాన్ని అమ్మితే 5కోట్లు లాభం వస్తుంది. కానీ నమ్మకంపై ఓన్‌గా రిలీజ్ చేశాడు అని చెప్పారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:love, failure, movie, Political, Entertainment, Telugu
|