చలన చిత్ర రంగంపై సేవా పన్నును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రకటించింది. ఒక్క రోజు సమ్మె వల్ల దాదాపు 9 వేలకు పైగా థియేటర్లు మూతపడనున్నట్లు తెలి పింది. అయితే మల్టీప్లెక్స్‌లు మాత్రం ఈ సమ్మెలో పాలుపంచుకోవటం లేదు. 10.3 శాతం సేవాపన్ను ఉపసంహరించాలని కోరుతూ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌తో జరిగిన సమావేశం విఫలం కావటంతో సమ్మెకు దిగాలని ఎఫ్‌ఎఫ్‌ఐ నిర్ణయించింది. ‘పలు పన్నులతో దేశంలో సినీరంగం ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉంది. సేవా పన్ను మోయలేని భారంగా మారింది. దేశంలో ఏటా 1200 చిత్రాలను నిర్మిస్తున్నా కొన్నే విజయం సాధిస్తున్నాయి. సినీ పరిశ్రమకు రాయితీలు కావాలి. సేవా పన్ను భారం భరించాలంటే టికెట్ ధరలు పెంచాలి. అవి ఇప్పటికే అధికంగా ఉన్నాయి. సేవా పన్ను విధించటంతో చిత్ర నిర్మాణ వ్యయమూ పెరుగుతుంది’ అని ఎఫ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు వినోద్ లాంబా పేర్కొన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Film, Industry, to, Observe, Bandh, on, 23rd, February, Political, Entertainment, Telugu
|