తెలంగాణ రాష్ట్ర సమితి పని అయిపోయిందంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో అయన విలేఖర్లతో మాట్లాడుతూ వాస్తవం ఒకటైతే... చంద్రబాబుకు మరొకటి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. చిన్న మెదడు చితికిపోవడం వల్లే బాబుకు అలా కనిపిస్తుందని అన్నారు. మెదడుకు సంబంధించి సి.టి. స్కానింగ్ చేయించుకుంటే బాగుంటుందని హితవు పలికారు.
గతంలో పోటీ చేసిన 13 నియోజవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదన్న విషయాన్ని బాబు మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. ఆసారి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకంటే స్వతంత్ర అభ్యర్థులకే ఓట్లు ఎక్కువగా వచ్చాయని గుర్తు చేశారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా టీఆర్ఎస్ పని అయిపోయిందని వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే ఆయనకు మతి భ్రమించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మద్యం గురించి ఇంటా బయటా మాట్లాడుతున్న చంద్రబాబు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మద్యం సిండికేట్లపై గంటలకొద్దీ మాట్లాడుతున్న బాబు... తెలంగాణ విషయానికొచ్చేసరికి 'తాను తెలంగాణకు అనుకూలం' అంటూ ఒక్క వాక్యంతోనే సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:harish, rao, comments, on, babu, Political, Entertainment, Telugu
|