సినీనటి జెనీలియా డిసౌజాతో పాటు మరో నలుగురిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త సట్టా తిరుపతయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.
అంజనీపుత్ర ఇన్‌ఫ్రా పేరుతో 2008లో మాసబ్‌ట్యాంక్‌కు చెందిన సుజిత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందులో సుదర్శన్‌కుమార్ రెడ్డి సవ్వా వెంకట మనోహర్‌రెడ్డి వై.సత్య డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి జెనీలియా వ్యవహరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో 150 కోట్ల రూపాయలతో 500 ప్లాట్ల వెంచర్ వేస్తున్నట్టు ప్రకటనలిచ్చారు. తిరుపతయ్య వీటిల్లో 300 చదరపు గజాల చొప్పున రెండు ప్లాట్లు కొనుగోలు చేశాడు.
వీటికి వాయిదా పద్దతిలో 48 లక్షలు చెల్లించాడు. ఏళ్లు గడిచినా అంజనీ సంస్థ ప్లాట్లు కేటాయించలేదు. అసలు అక్కడ వెంచరే లేదని గుర్తించిన తిరుపతయ్య వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఫోరం సూచనల ప్రకారం జెనీలియాతో పాటు ఎండీ.సుజిత్‌రెడ్డి ముగ్గురు డైరెక్టర్లపై నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై స్పందించిన కోర్టు ఐపీసీ 120 (బి) 420 406 506 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. 27వ తేదీ నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని పేర్కొంది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:cheating, case, on, genelia, Political, Entertainment, Telugu
|