అక్కినేని నాగార్జున ఈ రోజు మీడియా తో మాట్లాడుతూ వంద కోట్లు పెట్టుబడి పెట్టి తమ అన్నపూర్ణ స్టూడియోని ఆసియాలోనే ‘మోడర్న్ స్టూడియో’గా మలచడం జరిగినదని అన్నారు. అలాగే తమ స్టూడియో ఇక నుంచి బాలీవుడ్హాలీవుడ్ అవసరాలు తీర్చటం తమ టార్గెట్ అన్నారు. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసానని చెప్పుకొచ్చారు. తమ స్టూడియోను హాలీవుడ్ వారు సైతం ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. ఈ విశేషాలను తెలపటానికి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
మా తొలి టార్గెట్ బాలీవుడ్. ఈ స్టూడియోలో తాజాగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు ముంబయ్‌లో అతి కొద్ది స్టూడియోస్‌లో మాత్రమే ఉన్నాయి. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్‌ని టార్గెట్ చేయబోతున్నాం. అతి తక్కువ వేతనానికి కార్మికులను జూనియర్ ఆర్టిస్టులను సమకూర్చడం జరుగుతుంది. స్టూడియో రెంట్ తక్కువగా ఉంటుంది. వచ్చే ఏడాది చివరికల్లా 45 నుంచి 50 కోట్ల రూపాయల టర్నోవర్ వస్తుందని అంచనా వేస్తున్నాం అని చెప్పారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Nagarjuna, target, hollywood, bollywood, Political, Entertainment, Telugu
|