తమన్నాతో కలిసి రామ్‌చరణ్ చేసిన 'రచ్చ' ఇచ్చిన షాక్ నుంచి అభిమానులు ఇంకా తేరుకోలేదు. కానీ చరణ్ మాత్రం తరువాత ప్రాజెక్ట్‌లపై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న 'ఎవడు' సినిమా తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ఈనెల 27 నుంచి ఇక్కడ మొదలయ్యే ఈ సినిమా షూటింగ్‌లో ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ప్రస్తుతం 'జంజీర్' సినిమా షూటింగ్ బిజీలో ఉన్న చరణ్ 30వ తేదీ నుంచి 'ఎవడు' షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఆరోజు నుంచి సమంతా-చరణ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించుకున్నట్టు చెబుతున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమాకి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అల్లు అర్జున్ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ramcharans, evadu, Political, Entertainment, Telugu
|