రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వాయలార్ రవికి ఈ రోజు తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి ఇంట్లో అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
అల్పాహార విందు అనంతరం వాయలార్ రవి చిరంజీవి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు ముఖ్య నేతలలో చిరంజీవి ఒకరు అని చెప్పారు. చిరంజీవిని రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేశాక ప్రచార పర్వంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఏ పార్టీలో అయినా భిన్నాభిప్రాయాలు సహజమేనన్నారు. ఉప ఎన్నికలలో సమర్థులకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ శ్రేణులను పార్టీకి వినియోగించుకుంటామని చెప్పారు. అన్ని సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయన్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Rajakeeyalalo, kuda, chiru, mega, Political, Entertainment, Telugu
|