టాలీవుడ్ యువ నటుడు రానా దగ్గుపాటి ఇటీవలే ‘కృష్ణం వందే జగద్గురుం’ షూటింగ్లో గాయపడ్డ విషయం తెలిసిందే. డాక్టర్ల కోరిక మేరకు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న రానా మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. నయనతార హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. వేదం తరువాత వస్తున్న చిత్రం కావడం తో ఈ సినిమా ఫై మంచి అంచనాలే వున్నవి. రానా ఈ సినిమాలో బీటెక్ బాబు అనే పాత్ర పోషిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జాగర్లమూడి సాయి నిర్మిస్తున్నారు.
నా ఇష్టం ఫ్లాప్ కావడం తో రానా ఈ సినిమా మీద చాల ఆశలే పెట్టుకున్నాడు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Krishanam, vandhe, jagadgurum, antunna, rana, Political, Entertainment, Telugu
|