బిజినెస్ మేన్ సినిమా సూపర్ హిట్ కావడం తో హిట్ పైర్ అనిపించుకున్న జంట మహేష్ బాబు మరియు కాజల్. ఈ జంట మరో సారి తెరపై కనువిందు చేయనుంది.
సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో కథానాయికగా పలు పేర్లు అనుకున్నప్పటికీ చివరికి కాజల్ ని ఖరారు చేసారు. ఈ నెల 23న షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఒక ప్రత్యేక సెట్లో పాట ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Jattu, kaduthunna, businessman, janta, Political, Entertainment, Telugu
|