గతం లో దాసరి .మేస్త్రి అనే వ్య౦గ్యాత్మక చిత్రం తీసి చిరు మీద డైరక్ట్ సెటైర్స్ వేసారు. ఇప్పుడు మరో ఎటాక్ కి దాసరి సిద్దమవుతున్నారు.
ఆ సినిమాకి అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్ పెట్టినట్లుసమాచారం. ఈ టైటిల్ ని ఆయన చాలా కాలం క్రిందట ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసారు. ఆ సినిమాలో పూర్తిగా చిరు రాజకీయ జీవితం మీద సెటైర్స్ వేయటానికి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
అలాగే మహానుభావులు ఫోటోలు వెనకాల పెట్టుకున్నంత మాత్రాన మనం మహానుభావులం అవుతామా..పెంచుకునే కుక్కకి టైగర్ అనే పేరు పెట్టినంత మాత్రాన కుక్క పులి అవుతుందా అని గతం లో మేస్త్రి సినిమా ద్వారా విమర్శలు చేసారు. ఇప్పుడు దాసరి మరిన్ని విమర్సలకు పదునుపెడతారో చూదాం....
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Muta, mestri, meedha, mestri, settaires, Political, Entertainment, Telugu
|