
భారీ టాలెంట్ హంట్ నిర్వహించి వాటిలో ఎంపిక చేసిన స్క్రిప్ట్ లను చిత్రాలుగా మలచనున్నామని “పంజా” చిత్ర నిర్మాతల్లో ఒకరయిన నీలిమ తిరుమల శెట్టి మీడియా తో చెప్పారు. ఇలా ఎంపిక చేసిన మొదటి చిత్రం “అలియాస్ జానకి” ఈ చిత్రం ఏప్రిల్ 25న హైదరాబాద్ లో మొదలు కానుంది. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఎల్ వి ప్రసాద్ అకాడెమీ నుండి పట్టా పొందిన ఇతను పలు లఘు చిత్రాలకు అవార్డులు గెలుచుకున్నారు. వెన్నెల 1 1/2 చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు.
సంగమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సంవత్సరానికి మూడు చిత్రాలను చేస్తున్నామని ప్రకటించింది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తానని మీడియా తో చెప్పారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Bhari, talent, hunt, nirvahinchanunna, sangamitra, arts, Political, Entertainment, Telugu
|