రాజమౌళిప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌తో సినిమా తీయనున్నట్లు రాజమౌళి సంకేతాలు ఇవ్వడంతో త్వరలోనే వీరి కాంబినేషన్లో సినిమా ఖాయమని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
అయితే అభిమానుల ఆశ ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టు మళ్లీ వెన్నక్కి వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఇద్దరూ పెద్ద ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్స్‌తో ఉండటమే. రాజమౌళి ప్రస్తుతం తన దృష్టంతా ‘ఈగ’ సినిమాపైనే పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి నుంచి సినిమా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రాజమౌళి సినిమా సినిమాకు కాస్త ఎక్కవ గ్యాపే తీసకుంటారు. ప్రభాస్ ఇమేజ్‌కు తగిన కథ తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. హిట్ సినిమా తీయాలంటే ఆమాత్రం సమయం తీసుకోవడం కరెక్టే కదా.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Rajamouli, prabhas, cinema, emaienadhi, Political, Entertainment, Telugu
|