యువహీరోలతో పోటా పోటీగా ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న క్రెడిట్ యువరత్నకు దక్కుతుంది. పరిశ్రమ శ్రేయస్సు కోసం హీరోలు ఎక్కువ చిత్రాల్లో నటించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. కారణం ఏదైనా బాలకృష్ణ సినిమాల సంఖ్య పెంచడం వల్ల ఉపయోగమే. 'సింహా'తో సక్సెస్‌గేమ్ ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన 'శ్రీరామరాజ్యం' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు అధినాయకుడు పూర్తిచేశారు. ఇందులో ఆయన మూడు పాత్రలు చేయడం విశేషం. 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'లో ప్రత్యేక పాత్రని చేస్తున్నారు. ఎల్లో ఫ్లవర్స్ సంస్థలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం పేరు ప్రకటించనప్పటికీ 'శ్రీమన్నా రాయణ'గా ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బెల్లంకొండ సురేష్ సంస్థలో మరొక సినిమా చేయడానికి అంగీ కరించినట్టు సమాచారం. గతంలో ప్రకటించిన చిత్రాలు కాకుండా తాజాగా శ్రీవాస్ (లక్ష్యం ఫేమ్) దర్శకత్వంలో చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఇది ఇదేవారంలో మొదల కానుందని సమాచారం. ఇవే కాకుండా మరికొన్నింటిని బాలకృష్ణ అంగీకారం తెలపాల్సి ఉంది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:balayya, new, movies, Political, Entertainment, Telugu
|