గ్రాఫిక్స్ మాయాజాలం తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అరుంధతి సినిమాలోని ‘జేజమ్మ’ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ద్వారా అనుష్కకు ఎంతటి క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే.
కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంభందించిన హిందీ రీమేక్ జెమిని ఫిల్మ్స్ వారు దక్కించుకోన్నారు. జేజమ్మ పాత్ర కోసం మొదటగా ఐశ్వర్య రాయ్ కత్రిన కైఫ్ పేరు అనుకున్నప్పటికీ చివరగా కరీనా కపూర్ పేరును ఖరారు చేసారు. తెలుగులో ఈ చిత్రాన్ని మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. రాహుల్ నంబియార్ అందించిన స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. 2009 లో సంక్రాంతికి విదుధలైన ఈ సినిమా అప్పటి రికార్డుల్లన్నిటిని చెరిపివేసినది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Zero, size, jejjamma, Political, Entertainment, Telugu
|