నాగార్జున శ్రీనివాస రెడ్డి కంబినేషన్ లో వస్తున్న ఢమురకం చిత్రం ఫైనాన్సియల్ ట్రబుల్స్ లో చిక్కుకుందని టాలీవుడ్ సమాచారం ఈ నేపధ్యంలో ఓ ప్రముక పత్రిక వారు నాగార్జునని ఈ విషయమై ప్రశ్నించారు. దానికి నాగార్జున నవ్వుతూ కొట్టిపారేసారు. అలాంటిదేమీలేదని కేవలం గ్రాఫిక్స్ వల్ల సినిమా లేటవటం తప్ప మరేమీ కాదని అన్నారు. ఈ చిత్రం తన కెరీర్ లో మంచి సినిమాగా మిగులుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
ఢమురకం తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడని విధంగా గ్రాఫిక్స్ ఉంటాయని చెప్తున్నారు. శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో వస్తున్న ఈ చిత్రం లో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Danger, lo, damurakam, Political, Entertainment, Telugu
|