ఈ టైటిల్ చూసి తేజ సినిమా అనుకున్నారా! కాదండి ఈ డాష్..డాష్..చంద్రబాబు...బొత్స...గురించి.
మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగాతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇచ్చే వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కదిలేది లేదని నారా చంద్రబాబు నాయుడు పట్టబట్టారు.రోడ్డుపైన బైఠాయించారు.ప్రజాస్వామ్య బద్ధంగా చేసే ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఎస్పీ కార్తికేయపై మండిపడ్డారు. తాను కదిలేది లేదంటూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ కార్యాలయం జంక్షన్‌లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి కూడా చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు మరింతగా ఆగ్రహించారు.
చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసు బారికేడ్లను ఛేదించారు. దాంతో చంద్రబాబు విగ్రహం వైపు కదిలారు.
ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న చంద్రబాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మరో వైపు................
చంద్రబాబుపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత సృష్టించేందుకు తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.రెండెకరాల ఆస్తి ఉన్న చంద్రబాబు రెండు వేల ఎకరాలు సపాందించారని అటువంటి చంద్రబాబు తనపైన మాట్లాడుతారా అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు చంద్రబాబు రావడాన్ని ఆయన తప్పు పట్టారు. చట్టాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:neeku, naku, dash, dash, Political, Entertainment, Telugu
|