బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జంజీర్’ చిత్రానికి రీమేక్ గా వస్తున్న తాజా రామ్ చరణ్ 'జంజీర్'. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ రచయితలు అయిన సలీమ్ జావేద్ అక్తర్‌లు తమ కథను మళ్లీ రీమేక్ చేయడానికి తమ అనుమతి తీసుకోలేదని తమ స్టోరీని వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో వారు తాజాగా లీగల్ నోటీసులు పంపారు.
"చర్చించుకోవడానికి రమ్మని అమిత్ కు చెప్పాం. మమ్మల్ని మూడుసార్లు కలిసిన అమిత్ ఒక్కసారి కూడా రాయల్టీ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కొద్ది రోజుల్లో ఈ విషయం గురించి మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని వివరాలూ చెబుతాం" అని జావేద్ తెలిపారు.
రామ్ చరణ్ ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:vivadam, lo, chikkukunna, janjir, Political, Entertainment, Telugu
|