విజయనగరం పెరేడ్‌గ్రౌండ్ వద్ద పోలీసులపై చంద్రబాబు మండిపడ్డారు. 'మద్యం మాఫియా డాన్ బొత్సకు కొమ్ముకాస్తున్నారు. దొంగలకు కాపలా ఉంటూ చట్టాన్ని గౌరవించే వారిని అడ్డుకుంటారా? నిజాయితీ గల పోలీసులంతా ఓవైపు రండి' అంటూ పోలీసులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'రెండు రాజకీయ పార్టీలు ఒకేసారి వస్తే ఒక్కొక్కరికీ ఒక్కోరోజు అనుమతిస్తానని చెప్పలేని నువ్వేమి ఎస్పీవి. వాటీజ్ యువర్ డ్యూటీ? ఎక్కడి నుంచి వచ్చావు? ఏమనుకుంటున్నావు? దొంగలకు కాపలా కాస్తారా? వాటార్ యు టాకింగ్. ఏం తమాషాగా ఉందా?' అని మండిపడ్డారు. తాను కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తాననీ అనుమతించకపోతే రెండురోజులు విజయనగరంలోనే ఉంటాననీ హెచ్చరించారు. పలుమార్లు బారికేడ్లు తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించిన టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. చంద్రబాబుతోపాటు నలుగురైదుగురు నాయకులకే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు అనుమతిస్తామని చెప్పగా బాబు నిరాకరించారు. రోడ్డుపై బైఠాయించారు. ఎట్టకేలకు పోలీసులు అనుమతించడంతో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి బాబు మాట్లాడారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:chandra, babu, fire, on, sp, Political, Entertainment, Telugu
|