కళారంగానికి ఇవ్వాల్సిన అవార్డులు సాంస్కృతిక సంస్థలు ఇచ్చేవి. కాలక్రమేణా అవి ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధపడింది. అవే నంది అవార్డులు. అంతకుమించి జాతీయస్థాయిలో వచ్చే అవార్డులు కూడా వున్నాయి. కానీ ఇవన్నీ ఒక్కటే గాటిన కట్టేయడంలో తప్పులేదని దాసరి నారాయణరావు తేల్చి చెబుతున్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అవార్డులనేవి నీరసంగా వుండే రోగికి ఇంజక్షన్‌లు లాంటివి. కానీ వాటిని కూడా కొందరు పైరవీకారులు సిండికేట్‌గా ఏర్పడి నాశనం చేస్తున్నారు. అవార్డులంటే గౌరవం పోయింది. అది రాష్ట్ర జాతీయ స్థాయిలోనూ పాకింది. ముఖ్యంగా పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణతోపాటు దాదా సాహెబ్‌ఫాల్కే అవార్డులు కూడా పైరవీలు చేసి కొందరు తెచ్చుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు లేదు. దానికి సెపరేట్ రాకెట్‌కూడా నడుస్తోందని ఘాటుగా విమర్శించారు. కాగా గత ఏడాది దాసరి తీసిన పరమవీరచక్ర చిత్రానికి నంది అవార్డు వస్తుందని ఆశించి భంగపడ్డారు. బహుశా ఆయన అలా అనడంలో తప్పులేదని దాసరి కామెంట్‌పై పలువురు ఇండిస్టీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవీఎస్ ప్రవేశపెడుతున్న 'బ్లాగ్ బస్టర్స్ అవార్డ్స్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ అవార్డులను 'బ్లాగ్స్' అనే సోషనల్‌నెట్‌వర్క్‌ద్వారా ఎంపికచేయడం ప్రపంచంలోని మొట్టమొదటిగా ఏవీఎస్ పేర్కొన్నారు. 'ఏవీఎస్ ఫిలిమ్ డాట్ ఇన్'లోకి వెళితే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:dasari, speaks, about, avs, blog, awards, Political, Entertainment, Telugu
|