ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిన పుట్టపర్తి వైభవం మసకబారింది. సత్యసాయి బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో దేశ విదేశీ భక్తులతో కిటకిటలాడిన పట్టణం నేడు బోసిపోతోంది. సత్యసాయి శివైక్యం పొం ది నేటికి కచ్చితంగా ఏడాదవుతుంది. సత్యసాయి దాదాపు 217 దేశాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థల పేరుతో దీన జనులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
పపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా పేరుగాంచారు. సత్యసాయి 2011 ఏప్రిల్ 24న అనారోగ్యంతో పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శివైక్యం పొందారు. ఆయన భౌతికంగా ఉన్న రోజు ల్లో పుట్టపర్తి ప్రపంచ ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లింది. విశ్వనాగరిక నగరాన్ని తలపించింది. నిత్యం విదేశీ భక్తులు వేల సంఖ్యలో సందర్శించేవారు. వారి బస కోసం 1500పైగా లాడ్జీలు వెలిశాయి. గతంలో ఒక గది అద్దెకు తీసుకోవాలంటే రోజుకు కనీసం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లించాల్సి ఉండేది.
తీస్టార్ మొదలుకుని చిన్నాచితక హోటళ్ల వరకు నిత్యం యాత్రికులతో కళకళలాడుతూ ఉండేవి. అలాగే జిల్లా నలుమూలల నుంచే గాక వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో బస్సులు వచ్చే వి. రైలు విమాన సర్వీసులనూ ప్రారంభించారు. ఇక పట్టణంలో ప్రతి రోజూ ఆర్థిక లావాదేవీలు రూ.కోటిన్నర దాకా ఉండేవి. భూముల ధర లూ ఆకాశంలో విహరించేవి. అయితే... నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. బాబా శివైక్యం తర్వాత రియల్ బూమ్ ఒక్కసారిగా పడిపోయింది. రూ.లక్షల్లో పలికిన సెంటు భూమి రూ.వేలకే లభ్యమవుతోంది.
అయి నా కొనేవారు లేరు. లాడ్జీల్లో గదుల అద్దెలు తగ్గిపోయాయి. గది రూ.200 నుంచి రూ.700లోపే దొరుకుతోంది. బాబా ఉన్న రోజుల్లో పది వేలకు పైగా ఫ్యాన్సీ షాపులు ఉండగా... నేడు వాటి సంఖ్య రెండు వేల లోపే. ఉన్న వాటిలోనూ చాలా వరకు వ్యాపారాలు లేక బోసిపోతున్నాయి. గతం లో హోటల్‌లో టీ తాగాలంటే రూ.50 వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం టిఫిన్ తిన్నా అంత దాటడం లేదు. పుట్టపర్తికి వచ్చే బస్సుల సంఖ్య కూడా తగ్గిపోయింది. రెండు వందలలోపే వస్తున్నాయి.
ఆర్థిక లావాదేవీలు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య మాత్రమే ఉన్నట్లు పుట్టపర్తి వాసులు చెబుతున్నారు. ఏదిఏమైనా బాబా లేని లోటు ప్రతి రంగంపైనా స్పష్టంగా కన్పిస్తోంది. కాగా... బాబా శివైక్యం తరువాత తొలి ఆరాధనోత్సవాలు జరుగుతుండడంతో ప్రస్తుతం భక్తుల సంఖ్య పెరిగింది. వ్యాపారాలూ కాస్త పుం జుకున్నాయి. కాగా... పుట్టపర్తి వైభవాన్ని కొనసాగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Puttaparthi, is, missing, its, soul, Political, Entertainment, Telugu
|