
నన్ను రామ్ చరణ్ తేజ్ అని పిలవొద్దు...జస్ట్ రామ్ చరణ్ అని పిలవండి అంటూ గతంలో ఓసారి మెగా పవర్ స్టార్ విన్నవిం చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ అంతా ఇంకా రామ్ చరణ్ తేజ్ అనే పిలుస్తు న్నారు. మీడియాలో కూడా అదే ప్రచారం జరుగు తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మరోసారి తన ట్విట్టర్ ద్వారా విన్నవిం చుకు న్నాడు. ‘మా నాన్న నాకు రామ్ చరణ్ అని మాత్రమే పేరు పెట్టారు...దయచేసి నా పేరు చివర తేజ అనే పదం యాడ్ చేసి పిలవొద్దు’ అన్నారు. ఇక నుంచి అభిమానులు మీడియా వాళ్లు చరణ్ ని జస్ట్ 'రామ్ చరణ్' అంటూ సంబోధించడం అలవాటు చేసుకోవాలి!
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ramcharan, name, change, Political, Entertainment, Telugu
|