ప్రకాశం జిల్లా ఒంగోలు జరిగిన విలేకరుల సమావేశంలో కె.ఏ.పాల్ మాట్లాడుతూ తాను శపిస్తే ముక్కలు ముక్కలు అవుతావని నీ గూండాయిజం రౌడీయిజం మానుకోవాలని బాలినేనికి సూచించారు. ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగిన శాంతి సభలను అడ్డుకునేందుకు బాలినేని తీవ్రంగా కృషి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సభలను జరగకుండా చేసేందుకు ఆయన పలువురిని బెదిరించారని ధ్వజమెత్తారు. బాలినేని అక్రమంగా కోట్లాది రూపాయలు కూడబెట్టారని పేదల భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన విమర్శించారు.
గతంలో దేవుడి కార్యక్రమాలను అడ్డుకుని పీస్ మిషన్ నిధులను కాజేయాలని చూసిన వారు ఒక్కరూ ప్రాణాలతో లేరని ఆయన చెప్పారు. ఏసుక్రీస్తు పేరుతో జరుగుతున్న ఈ సభలను ఆడ్డుకోవాలని చూస్తే ఏం జరుగుతుందో తెలియక ఆయన ఇలా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Sapisthanantunna, K, A, Paul, Political, Entertainment, Telugu
|