భాను సంపాదించిన 800 కోట్ల రూపాయల ఆస్తుల బినామీగా మంగళి కృష్ణ వ్యవహరించినట్లు భాను సిఐడి అధికారుల వద్ద అంగీకరించినట్లు ఓ వార్తా పత్రిక రాసింది.
మంగళి కృష్ణ అతడి కుటుంబ సభ్యులు ఆదినుంచీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరవిధేయులు. మంగళి కృష్ణ వైయస్ జగన్‌కు దాదాపు కుడిభుజంగా పనిచేస్తున్నాడు. మంగళి కృష్ణ పరిటాల హత్య కేసులో కూడా నిందితుడి గా వున్నాడు.
మంగళి కృష్ణ భానుకు బినామీ కావడంతో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చిక్కులో పడతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మంగళి కృష్ణను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నామని సిఐడి వర్గాలు అంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక వివాదాలు కోర్టు కేసులు రాజ కీయవత్తిడుల మధ్య తలమునకలై ఉన్న జగన్‌కు తనకు అత్యంత సన్నిహితుడైన మంగళికృష్ణ ద్వారా వివాదం గోరు చుట్టూ మీద రోకలి పోటు లాంటిదే!
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:800, kottla, binami, mangali, krishna, c, and, o, ys, jagan, Political, Entertainment, Telugu
|