అధిక ధరలూ నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలోనూ సెంటిమెంట్‌దే పైచేయి అయింది. ఈసారి అక్షయ తృతీయ అమ్మకాలు అంచనాలను అందుకొన్నాయి. గతేడాదితో పోల్చితే 30 శాతానికిపైగా బంగారం ధర పెరిగినా.. కొనుగోళ్లపై ఆ ప్రభావం తక్కువగానే కనిపించింది. భారీగా పెరిగిన ధరలు ఎక్సైజ్ కస్టమ్స్ సుంకాల పెంపు వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అమ్మకాలు తగ్గుతాయని భావించారు.
కానీ చివరకు ఫరవాలేదనిపించాయి. అయితే ఈసారి ఒకే కస్టమర్ ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు జరపకపోయినా.. మొత్తం కస్టమర్ల సంఖ్య పెరిగిందని వర్తకులు చెబుతున్నారు. బ్రాండెడ్ జువెలరీ షోరూమ్‌ల్లో కొనుగోళ్ల సరళి బాగున్నా.. చిన్న నగల షాపుల్లో గిరాకీ అంతంత మాత్రంగానే ఉందని వర్తకులు చెప్పారు. కస్టమర్లు తక్కువ పరిమాణంలోనే కొనుగోళ్లు జరిపారని గతేడాదితో పోల్చితే ఈసారి అమ్మకాలు తక్కువగానే ఉన్నాయని ఈస్ట్ సిటీ జువెలర్స్ అసోసి యేషన్(హైదరాబాద్) వైస్ ప్రెసిడెంట్ కె.కృష్ణ చెప్పారు. హైదరాబాద్ తర్వాత విశాఖ విజయవాడ తిరుపతి వరంగల్ గుంటూరు నెల్లూరు కడప కరీంనగర్ నిజామాబాద్ అనంతపురం కర్నూలుల్లో అమ్మకాలు అధికంగా నమోదవుతాయి.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:aksya, trutiya, Political, Entertainment, Telugu
|