నాగార్జునకు ఇటీవలి కాలంలో తన పంథా మార్చి యాక్షన్ ఫ్యామిలీడ్రామా సోషియో ఫాంటసీ డివోషనల్ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆయన చేస్తున్న 'ఢమరుకం' సోషియో ఫాంటసీ కాగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేస్తున్న 'శిరిడీ సాయి' పూర్తి స్థాయి ఆధ్యాత్మికం. ఇప్పుడేమో అకస్మాత్తుగా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు.
దానికి 'లవ్‌స్టోరీ' అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టుగా సమాచారమ్. 2002లో నాగ్‌తో 'సంతోషం' వంటి విజయవంతమైన చిత్రం చేసిన దశరథ్ ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కలయికలో దశాబ్దం తర్వాత ఈ సినిమా రూపొందుతోంది. 'మిస్టర్ పర్‌ఫెక్ట్' తర్వాత దశరథ్ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో నాగ్ సరసన నయనతార నటించనున్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:LOVE, STORY, NAG, Political, Entertainment, Telugu
|