అతి త్వరలో మెగా అభిమానులకి మరో మెగా ఈవెంట్ రెడీ కానున్నది.
త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాహ వేడుకకి సంభందించిన కొంత సమాచారం మాకు లభించింది. గండిపేట లోని ఫామ్ హౌస్లో మెగా స్టార్ తనయుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన వివాహ వేడుక చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 14 ఉదయం 9:45 గంటలకు ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఇరు కుటుంబాలకు సంభందించిన సన్నిహితులు మరియు వివిఐపి లను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిపించనున్నట్లు సమాచారం. 2012లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జరిగే అతి పెద్ద వివాహ వేడుక ఇదే కానుంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Mega, pellisandadi, Political, Entertainment, Telugu
|