ఉప ఎన్నికలు జరుగుతున్న పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుపతి నియోజకవర్గం ఒకటి.ఇక్కడ కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ ఈ నియోజకవర్గం టిక్కెట్ తనకి ఇస్తే నెగ్గి చూపుతానంటున్నారు.
ప్రధానంగా గల్లా జయదేవ్ మాజీ ఎమ్మెల్యే వెంకట రమణ పోటీ పడుతున్నారు. అయితే చిరు.. జయదేవ్ అభ్యర్థిత్వం పట్ల విముఖత చూపిస్తున్నారట. ఇటీవల తిరుపతిలో జరిగిన ఓ బహిరంగ సభలో గల్లా అరుణ చిరంజీవి ఒకే వేదిక పైన ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చిరు తన వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.
ఐతే తన వర్గం నేతకు టికెట్ ఇప్పించుకుని అతనిని నేగ్గించే బాద్యతను చిరు ఎంత వరకు తిసుకున్తరనేది ప్రస్నార్ధకమే!
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Neggi, choputhanantunna, gallano, antunna, chiru, Political, Entertainment, Telugu
|