
రాష్ట్రంలో పద్దెనిమిది అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తిరుపతికి శాసనసభ కి రాజీనామా చేసి చిరంజీవి రాజ్యసభకు వెళ్లడం వల్ల ఉప ఎన్నికల జరగనుంది. దీనితో చిరంజీవికి ఈ స్థానం ప్రతిష్టాత్మకమైనది. మిగిలినచోట్ల గెలుపోటముల విషయం ఎలా ఉన్నా తిరుపతిలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెసు గెలవాల్సిందే. లేదంటే కాంగ్రెసుతో పాటు చిరంజీవి పరువు కూడా పోతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా చిరు కేంద్ర పదవికి తిరుపతికి లింక్ పెట్టిందనే వాదన వినిపిస్తోంది.తిరుపతిలో కాంగ్రెసు అభ్యర్థి గెలిస్తే ఆయనకు పదవి ఇస్తారని ఒకవేళ పార్టీ ఓడితే చిరు ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు. పెద్దల సభ కి వెళ్లి పెద్ద మనిషనిపించుకున్న చిరుకి ఈ తలనొప్పి చిరాకు తెప్పించేదే.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:chiru, ki, tirupathi, thalanoppi, Political, Entertainment, Telugu
|