andhravilas.com
Home  
Our Sites
Omsainath.orgజగన్ మెడకు చుట్టుకుంటున్న పరిటాల కేసు

Date Updated: 4/27/2012 12:29:50 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


ఇటీవల జరుగుతున్న పరిణామాల చూస్తుంటే మరుగునపడిన్ధనుకున్న పరిటాల రవి హత్య కేసు వైయస్ జగన్‌ను ఇరకాటంలో పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. పరిటాల రవి హత్య కేసును తిరగదోడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తన భర్త పరిటాల రవి హత్య కేసును తిరిగి సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అలాగే సూరి హత్య కేసులో జగన్‌ బంధువుల హస్తం ఉందని కాంగ్రెసు శానససభ్యుడు వీరశివా రెడ్డి ఆరోపించారు. అప్పుడు దర్యాప్తు చేసిన సీబీఐ వైఎస్‌ ఉన్న అధికార నివాసంలోకి వెళ్లి విచారించిందని కానీ వాస్తవాలేవీ వెలుగులోకి రానందున మరోసారి విచారిస్తే జగన్‌ లింకులు బయటపడతాయని వ్యాఖ్యానించారు. సీనియర్‌ ఎంపీ వి.హన్మంతరావు సైతం జగన్‌ నేరచరిత్రపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

తాజాగా అరెస్టయిన జగన్‌ అనుచరుడు మంగలి కృష్ణ ఆయనతో సంబంధాలున్న భానుకిరణ్‌ వ్యవహారం తెరపైకి రావడంతో జగన్‌కు పరిటాల రవి హత్య కేసును అంటగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు వార్తలు వస్తున్నాయి. పరిటాల రవి హత్యతో సంబంధాలున్నాయని చెబుతున్న మంగలి కృష్ణ భాను కిరణ్‌లతో వైయస్ జగన్‌కు ఉన్న సంబంధాలపై ఇప్పటికే కాంగ్రెసు తెలుగుదేశం పార్టీలు రచ్చ చేస్తున్నాయి . అప్పట్లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నందున తన పలుకుబడి వినియోగించి కేసును నీరుగార్చినందుకే ఆ కేసులో ముద్దాయిగా ఉన్న జగన్‌ తప్పించుకున్నారని ఫిర్యాదు చేస్తారని అంటున్నారు.

హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన జీఎన్‌ఎం మస్తాన్‌ రావు అనే రియల్‌ఎస్టేట్‌ వ్యక్తి రాసిన మరణ వాంగ్మూలాన్ని కూడా చర్చనీయాంశం చేయనుంది. తనను మంగలి కృష్ణ చంపుతానని బెదిరిస్తున్నాడని మాదాపూర్‌ ఎస్‌ఐ సీఐ కూడా వారినే ప్రోత్సహిస్తున్నందున విధిలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని తన చావుతోనయినా ఈ ప్రభుత్వం రౌడీలపై చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నానని తన మరణవాంగ్మూలంలో అతను రాశాడు. తన పిల్లలకు న్యాయం చేయాలని ఆత్మహత్య చేసుకునేముందు రాసిన లేఖలో దయనీయంగా అభ్యర్ధించాడు. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మీడియాకు బయటపెట్టింది. దాన్ని కూడా కరపత్రం రూపంలో ప్రచురించి పంచి పెట్టేందుకు సిద్ధమవుతోంది.

మొత్తం గా చూస్తే మరుగునపడిన్ధనుకున్న పరిటాల కేసు అటు తిరిగి ఇటు తిరిగి జగన్ మెడకు చుట్టుకుంటున్నట్లు కనబడుతున్నది.
-CC

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:Jagan, medaku, chuttukuntunna, paritala, kesu, Political, Entertainment, Telugu
More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories
Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Aagadu Movie Latest Wallpapers
Boochamma Boochodu Press Meet
Bullet Rani Movie Stills
Hansika
Lakshmi Rai
Regina Stills
Sri Nilayam Trailer Launch
Neha Deshpande
Sri Nilayam Trailer Launch
Santhosham Awards 1
Tamil Movies Photo Gallery
Nila Nagar Movie Stills
Oru Pakka Kadhai Launch
Thiruttu VCD Movie Press Meet
Thiruttu VCD Movie Stills
Aranmanai Movie Stills
Hansika
Lakshmi Rai
Regina Stills
Aadama Jaichomada Audio Launch
Aranmanai Audio Launch
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu
Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.