మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన వివాహం జూన్ 14న ఉదయం 7.30 గంటలకు గండిపేటలోని ఫాం హౌస్ లో జరగనున్నది. 14వ తేదీన జరిగే పెళ్లికి దేశంలోని రాజకీయ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
ఐతే రామ్ చరణ్ పెళ్లి లో అభిమానుల స్థానమెక్కడ అని చర్చించుకుంటున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు విఐపీలు ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం ఉంది. అభిమానులకు ఈ పెళ్లిలో ప్రవేశం లేదు. నేరుగా చూసే అవకాశం కల్పించడం లేదు. కేవలం టీవీల్లో చూసి ఆనందించాల్సిందే. భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Ramcharan, pelli, lo, abhimanula, sthanamekkada, Political, Entertainment, Telugu
|